జాండ్రపేట గ్రామప్రజలకు శుభవార్త..!

JYOTHI SAMBARAM IMAGES


సృష్టి కారకుడైన బ్రహ్మ విశ్వ సృష్టికి ఉపక్రమించి పంచ భూతములను తద్వారా దేవ, దానవ, మానవ, పశు పక్ష్యాది జీవ రాశులను సృజించెను.ఆ జీవరాసులలో పశు పక్ష్యాదులు ఎదుగుతూ దేహాభిమానము లేక సిగ్గు తెలియక నగ్నముగా సంచరించు చున్నవి. కాని బుద్ధి జీవులైన దేవ, దానవ, మానవ జాతులు దిగంబర సంచారము చూసి బ్రహ్మ కడుపు జుగుప్స పొంది మిక్కిలి భాదతో దేహ ఆచ్చాదనకు అవసరమైన వస్త్రమును తయారుచేయుటకు సిద్దపడెను. అయితే ఎంత ప్రయత్నించినా బ్రహ్మకు వస్త్రోత్పత్తి సాద్యము కాలేదు. దీనితో బ్రహ్మ కైలాసమునకేగి సృష్టి లోపమును నివేదించగా ఆ పరమేశ్వరుడు తరునోపాయముగా "దేవల మహర్షి" అనే దివ్య పురుషుని సృష్టించి ఆ మహాత్ కార్యమును ఆప్పగించెను. అంతట ఆ దేవల మహర్షి వస్త్రమును సృష్టించి, లోకమునకు అందించి సర్వ లోకాలకు నాగరికత నేర్పించెను. ఆ విధముగా మానరక్షణకు వస్త్ర సూత్ర సృష్టి చేయుట చేత "దేవలమను బ్రహ్మ " గా కీర్తింపబడెను. ఆ దివ్య పురుషుని వంశ శంభుతలే మన దేవాంగులు. మన దేవాంగులను పూర్వము "దేవ బ్రాహ్మణులూ" అని కూడా పిలిచేవారు

Thursday, January 5, 2012

Telugu Quotations1

HOME  1 2 3 

Sathya Sai













  1. ఈ రోజును ప్రేమతో మొదలుపెట్టు,ఇతరుల కోసం ప్రేమతో సమయం వెచ్చించు,రోజంతా నీలో ప్రేమను నింపుకో,ప్రేమతోనే ఈ రోజును ముగించు,దేవుని గుర్తించడానికి అదే సరైన దారి.

Benjamin Disraeli













  1. మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చు. కానీ ...ఏ పనీ చెయ్యకుండా ఆనందాన్ని పొందలేము.
  2. అనుభవం అలోచనలకు బిడ్డ అయితే, ఆలోచన ఆచరణకు బిడ్డ

Anupam Kher













  1. కొంతమంది ఆనందాన్ని కొనుక్కుంటారు...కొందరు సృష్టించుకుంటారు.....మనుషుల్లో అదే ముఖ్యమైన తేడా

--------@@--------

Robert Burton












  1. మనిషి జీవితంలో సోమరితనాన్ని మించిన విషాదం లేదు.
---------@@-------

Bruce Lee













  1. ముందు నీ లక్ష్యాన్ని నిర్ణయించుకో, తర్వాత దాన్ని సాధించడం కోసం కృషి చెయ్యి.
  2. ఒక మూర్ఖుడు ఓ తెలివైన ప్రశ్న నుండి నేర్చుకొనేదాని కంటే, ఒక తెలివైనవాడు ఒక మూర్ఖత్వపు ప్రశ్న నుండి నేర్చుకొనేదే ఎక్కువ.
  3. జ్ఞానం నీకు శక్తిని ఇస్తుంది, కాని వ్యక్తిత్వం గౌరవనిస్తుంది.
  4. నిజంగా జీవించడమంటే ఇతరుల కోసం జీవించడమే. 
  5. 10,000 గుద్దులను ఒక్క సారి అభ్యసించినవాడంటే కూడా నాకు భయం లేదు, కానీ ఎవడైతే ఒక్క గుద్దును 10,000  సార్లు అభ్యసించాడో వాడంటేనే భయం నాకు.

No comments:

Post a Comment