Edwin Herbert Land
- కొత్త ఆలోచనలు చేయడానికి మందు పాత ఆలోచనలను వదులుకోవాలి.
--------@@----------
Sachin Ramesh Tendulkar
- మంచి స్నేహితులంటే ఆకాశంలోని నక్షత్రలాంటివాళ్లు... కొన్నిసార్లు కళ్లకు కనబడకపోయినా అవసరమైన సందర్భాల్లో మనకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు.
- ఎప్పుడు క్రికెట్ ఆడినా నా దృష్టిలో నేనెప్పుడు ఆ ఆటను తక్కువగానో లేక చాలా ముఖ్యమైనదిగానో భావించనేలేదు.
- యావత్ దేశము నా కోసం ఎదురు చూస్తుంది,వాళ్ల ఎదురుచూపులే నేను మరింత కష్టపడి ఆడేలా చేస్తుంది.
- ఎవడైతే ఒకడు క్రికెటును ఎక్కువ కాలం ఆడుతాడో,అతడు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందుతాడు.
- ప్రజలు ముందు క్రికెట్ అనేది సమిష్టి జట్టుగా ఆడే ఆటా లేక వ్యక్తిగత ఆటా అని నిర్ణయించుకోవాలని నేను తలుస్తాను.
- నాకెప్పుడు భారతదేశం తరపున ఆడాలనే కల ఉండేది, కాని అందుకు నేనెప్పుడునాలో ఒత్తిడిని అనుమతించలేదు.
- ఓడిపోవడాన్ని నేను ద్వేషిస్తాను, క్రికెటే నా తొలి ప్రేయసి. ఒక్కసారి నేను మైదానంలోకి అడుగు పెట్టితే అది ప్రత్యేక పరిధి, అక్కడ ఎల్లప్పుడూ గెలుపు కోసమే ఆత్రుత.
- నేను తిరిగివెళ్ళిన దారినే సరిగ్గా కొనసాగించాలని కోరుకుంటున్నాను.
- నేను నా ఆరు గంటల నిష్కపటమైన క్రికెటును మైదానంలో అందించాలని కోరుకుంటున్నాను, దాని తర్వాత ఫలితం ఏదైతేనేం.
- నా జీవిత కాలంలో నేనెప్పుడు ఒక పరుగిడువానితో(runner) ఆడిందే లేదు, పాఠశాలలో సైతం, ఎందుకంటే కేవలం నాకు మాత్రమే తెలుసు, బంతి ఎటువైపు వెళ్ళేది, ఎప్పుడు ఆ బంతిని బలంగా కొట్టాను అని. నాకు పరుగిడువానికి(runner) దాని గురించి ఎప్పుడును తెలియదు కదా.
- నేనెప్పుడు నన్ను ఇతరులతో పోల్చుకోవడానికి ప్రయత్నించ లేదు.
- నేనెప్పుడు ఆలోచించనేలేదు నేను ఎక్కడికి వెళతానో లేక ఏ లక్ష్యమైనా నన్ను బలవంత పెడుతుందో అని.
- నా కొడుకు అర్జున్ ను క్రికేటరే కావాలని ఒత్తిడి చేయను. అతని కెరీర్ అతనిష్టం.
- హర్భజన్ స్వతహాగా దూకుడు స్వభావం కలిగిన క్రికెటర్. టెన్నిస్ లో మేకన్రోలాగా క్రికెట్ లోను కొందరు దూకుడు ఆటగాళ్లుంటారు.
- నువ్వు జీవితంలో ఏ స్థాయిలో టేకాఫ్ తీసుకుంటావు అనే దాని మీదే నువ్వు జీవితంలో చేరుకొనే స్థాయి ఆధారపడి ఉంటుంది.
- వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టును చూసి భారతీయులంతా గర్వించటమే కాదు. అదే స్ఫూర్తితో తమ స్వప్నాలను సాకారం చేసుకోవడానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను.
- ఎంతోమంది నన్ను అడిగిన ప్రశ్నకు సమాధానమిదే.....'నేను ఏ సినిమాలోనూ నటించటం లేదు.'
- ఫెధరర్ కు క్రికెట్ గురించి కూడా బాగా తెలుసు.
---------@@-------
Sekhar Kapoor
- నిన్న మొన్నటివరకు గడాఫీని పొగిడిన వివిధ దేశాధినేతలు ఇప్పుడు అతని చావును స్వాగతిస్తున్నారు. గడాఫీని క్రూర నియంతగా పోలుస్తున్న ఐరోపా దేశాధినేతలు దశాబ్దాలుగా ఎక్కడున్నారు? చమురు రాజకీయాల్లో నైతిక విలువలుకు స్థానమెక్కడ?
------@@------
Paulo Coelho
- ప్రపంచం మనకు విసిరే సవాళ్లను ఎదుర్కొంటూ ఎంజాయ్ చేయండి. వాటికి సమాధానాల గురించి ఆలోచించకండి. అవి ఎప్పుడూ మారుతుంటాయి.
-----@@-----
No comments:
Post a Comment