అనగనగా గుంటూరు గ్రామంలో సోమయ్య అనే వడ్రంగి ఉండేవాడు. రైతులకు వ్యవసాయానికి అవసరం అయిన నాగళ్లను ఎక్కువగా చేస్తుండేవాడు. పంటలు పండించే సమయంలో సోమయ్యకి ఖాళీ ఉండేది కాదు. నాగళ్లను తయారుచేయటానికి కావలసిన చెక్క కోసం సోమయ్య ఇతర ప్రాంతాలకు వెళ్తుండేవాడు. అక్కడ నుంచి తనకు కావలసిన చెట్లకొమ్మలను తెచ్చి వాటితో నాగళ్లను తయారుచేస్తుండేవాడు.
ఆ విధంగా పనిచేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే ఆ ఊరిలో అల్లరిపిల్లల మూక ఒకటి ఉండేది. పనిపాట లేకుండా ఊరిలో అల్లరిచిల్లరగా తిరుగుతూ అందర్నీ ఆట పట్టిస్తుండేవారు. వీరి అల్లరి చేష్టలతో ఊళ్లో వారందరూ విసుగుచెందారు. ‘‘వీరికి బుద్ధి ఎప్పుడు వస్తుందా?’’ అని గ్రామంలోని వారందరూ బాధపడసాగారు. ఒకరోజు సోమయ్య చెక్కల కోసం వెతుకుతున్నాడు. అనుకోకుండా ఆ ఊరిలోనే ఎండిన పెద్దచెట్టు ఒకటి కనిపించింది. అది తనకు పనికి వస్తుంది. అందుకని ఆ చెట్టును కొట్టి మధ్యగా చీల్చటానికి ఉపక్రమించాడు.
చెట్టు పెద్దది అయినందున ఎక్కువ సమయం పట్టింది. ఇంతలో మధ్యాహ్నం కావడంతో భోజనం చేసి వచ్చాక మిగిలిన పని పూర్తి చేయవచ్చని ఇంటికి వెళ్లాడు. ఏ పనీ లేకుండా తిరుగుతున్న అల్లరిమూక అక్కడకు వచ్చారు. ఆ చెట్టును చూశారు. చీల్చటానికి సోమయ్య వేసి ఉంచిన సీలలను తీసి ఆట పట్టించాలని భావించారు. వెంటనే ఒక పిల్లాడు కింద ఉన్న ఆ చెట్టు కొమ్మ మీద కూర్చొని మధ్యలో ఉన్న సీలలను చూశాడు. అది అక్కడ ఎందుకు ఉందో తెలియలేదు. ఏదో ఒకటి చెయ్యనిదే తోచదు కనుక ఆ సీలను బయటకు తీసే ప్రయత్నం చేశాడు. అది బయటకు రాగానే చెట్టు కాండానికి సీల చేసిన సందులో ఆ పిల్లవాడి కాలు పడింది. చెట్టు పెద్దది కావటంతో ఎంత గట్టిగా ప్రయత్నించి కాలు బయటకు రాలేదు, కాలు నలిగిపోయింది.
అల్లరి పిల్లలంతా దాన్ని చూసి భయపడ్డారు. ఏం చేయాలో తోచలేదు. బిక్కమొహాలు వేసుకొని చూస్తున్నారు. కాలు పడిన పిల్లాడి ఆర్తనాదాలు విని ఊరి వాళ్లు వచ్చారు. చెట్టు కాండం సందులో ఇరుక్కున్న పిల్లవాడి కాలుని బయటకు తీసి, పిల్లవాడిని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అల్లరిపిల్లల మూకని చెడామడా తిట్టారు. ఇతరుల పనుల్లో తల దూరిస్తే ఇలాగే అవుతుందని హెచ్చరించారు. ఇంకెప్పుడూ ఇలా చెయ్యవద్దని బుద్ధి చెప్పారు. అప్పటి నుంచి పిల్లలు అల్లరిపనులను మాని చక్కగా మసలుకోవటం ప్రారంభించారు.

No comments:
Post a Comment