జాండ్రపేట గ్రామప్రజలకు శుభవార్త..!

JYOTHI SAMBARAM IMAGES


సృష్టి కారకుడైన బ్రహ్మ విశ్వ సృష్టికి ఉపక్రమించి పంచ భూతములను తద్వారా దేవ, దానవ, మానవ, పశు పక్ష్యాది జీవ రాశులను సృజించెను.ఆ జీవరాసులలో పశు పక్ష్యాదులు ఎదుగుతూ దేహాభిమానము లేక సిగ్గు తెలియక నగ్నముగా సంచరించు చున్నవి. కాని బుద్ధి జీవులైన దేవ, దానవ, మానవ జాతులు దిగంబర సంచారము చూసి బ్రహ్మ కడుపు జుగుప్స పొంది మిక్కిలి భాదతో దేహ ఆచ్చాదనకు అవసరమైన వస్త్రమును తయారుచేయుటకు సిద్దపడెను. అయితే ఎంత ప్రయత్నించినా బ్రహ్మకు వస్త్రోత్పత్తి సాద్యము కాలేదు. దీనితో బ్రహ్మ కైలాసమునకేగి సృష్టి లోపమును నివేదించగా ఆ పరమేశ్వరుడు తరునోపాయముగా "దేవల మహర్షి" అనే దివ్య పురుషుని సృష్టించి ఆ మహాత్ కార్యమును ఆప్పగించెను. అంతట ఆ దేవల మహర్షి వస్త్రమును సృష్టించి, లోకమునకు అందించి సర్వ లోకాలకు నాగరికత నేర్పించెను. ఆ విధముగా మానరక్షణకు వస్త్ర సూత్ర సృష్టి చేయుట చేత "దేవలమను బ్రహ్మ " గా కీర్తింపబడెను. ఆ దివ్య పురుషుని వంశ శంభుతలే మన దేవాంగులు. మన దేవాంగులను పూర్వము "దేవ బ్రాహ్మణులూ" అని కూడా పిలిచేవారు

Friday, December 30, 2011

నిజాయితీపరుడు


మగధ రాజ్యాన్ని రాజనందుడు అనే రాజు పాలిస్తుండేవాడు. ఆయన నిస్వార్థపరుడు. బంధుప్రీతి, తరతమ భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూస్తూ, మంచి పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ రాజ్యంలో కోశాధికారిగా పనిచేస్తున్న సుషేణుడు పదవీ విరమణ చేశాడు. ఆ స్థానాన్ని భర్తీ చేసే బాధ్యతను మహామంత్రికి అప్పగించాడు రాజనందుడు. కోశాధికారి పదవికి తగిన అభ్యర్థి కోసం మహామంత్రి రాజ్యంలో దండోరా వేయించాడు. నిర్ణీత సమయానికి కొందరు వచ్చారు. మహామంత్రి వారి యోగ్యతలను, విద్యలను పరిశీలించి ఆనందుడు, దీప్తుడు అనే ఇద్దరిని అర్హులుగా తేల్చాడు. ఇద్దరూ సమఉజ్జీలుగా ఉన్నారు. కోశాధికారి పదవికి కావలసింది ఒక్కరే కాబట్టి వారిద్దరిలో ఒకరిని ఎంపిక చేయటానికి తన ఇంటికి తీసుకెళ్లాడు మహామంత్రి.

వారితో కాసేపు లోకాభిరామాయణం మాట్లాడిన మహామంత్రి... ఆనందుడిని పక్కకి తీసుకెళ్లి ‘‘చూడు మిత్రమా! మీ ఇద్దరిలో నేనెవరిని ఎంపిక చేస్తే వారికే ఈ కొలువు వస్తుంది. కాబట్టి నీవు నాకు వెయ్యి వరహాలను ఇవ్వు’’ అన్నాడు. దానికి ఆనందుడు ‘‘మహామంత్రీ! నాకు కొంత వ్యవధి ఇవ్వండి. మీరు కోరిన వెయ్యి వరహాలు ఇవ్వటమే కాకుండా కోశాగారం నుంచి మీరు ఎప్పుడు డబ్బు తీసుకున్నా వాటిని లెక్కల్లో చూపించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాను. కాబట్టి ఈ కొలువు మీరు నాకే ఇవ్వండి’’ అని కోరాడు.

ఆ తర్వాత దీప్తుడిని కూడా మహామంత్రి ఇదే విధంగా లంచం అడిగాడు. మహామంత్రి మాటలు విన్న దీప్తుడు ‘‘నేను లంచాలు, కానుకలు ఇచ్చి పదవిని పొందేవాడిని కాను. ఎప్పటికైనా స్వశక్తితో, తెలివితేటలతో, నైపుణ్యంతో పదవిని పొందుతాను. అంతేగాని ఇలాంటి అడ్డదారులు తొక్కను. ఇంకో విషయం, నేను ఈ కొలువులో చేరితే నీలాంటి వారిని మహారాజుకి పట్టిస్తాను’’ అని నిర్భయంగా చెప్పాడు.

మహామంత్రి వెంటనే ‘‘శభాష్! మీ ఇద్దరిలో ఎవరు నిజాయితీపరుడో తెలుసుకోవటానికే ఇలా మాట్లాడాను. నీలాంటి నిజాయితీపరులు, ధైర్యవంతులే ఈ పదవికి అవసరం’’ అని చెప్పి, అతడిని మహారాజు దగ్గరకు తీసుకెళ్లాడు. జరిగిన సంగతి తెలుసుకున్న మహారాజు కోశాధికారి పదవిని దీప్తుడికి అప్పగించాడు.

నీతి: నిజాయితీ... వ్యక్తిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది.
 

No comments:

Post a Comment