జాండ్రపేట గ్రామప్రజలకు శుభవార్త..!

JYOTHI SAMBARAM IMAGES


సృష్టి కారకుడైన బ్రహ్మ విశ్వ సృష్టికి ఉపక్రమించి పంచ భూతములను తద్వారా దేవ, దానవ, మానవ, పశు పక్ష్యాది జీవ రాశులను సృజించెను.ఆ జీవరాసులలో పశు పక్ష్యాదులు ఎదుగుతూ దేహాభిమానము లేక సిగ్గు తెలియక నగ్నముగా సంచరించు చున్నవి. కాని బుద్ధి జీవులైన దేవ, దానవ, మానవ జాతులు దిగంబర సంచారము చూసి బ్రహ్మ కడుపు జుగుప్స పొంది మిక్కిలి భాదతో దేహ ఆచ్చాదనకు అవసరమైన వస్త్రమును తయారుచేయుటకు సిద్దపడెను. అయితే ఎంత ప్రయత్నించినా బ్రహ్మకు వస్త్రోత్పత్తి సాద్యము కాలేదు. దీనితో బ్రహ్మ కైలాసమునకేగి సృష్టి లోపమును నివేదించగా ఆ పరమేశ్వరుడు తరునోపాయముగా "దేవల మహర్షి" అనే దివ్య పురుషుని సృష్టించి ఆ మహాత్ కార్యమును ఆప్పగించెను. అంతట ఆ దేవల మహర్షి వస్త్రమును సృష్టించి, లోకమునకు అందించి సర్వ లోకాలకు నాగరికత నేర్పించెను. ఆ విధముగా మానరక్షణకు వస్త్ర సూత్ర సృష్టి చేయుట చేత "దేవలమను బ్రహ్మ " గా కీర్తింపబడెను. ఆ దివ్య పురుషుని వంశ శంభుతలే మన దేవాంగులు. మన దేవాంగులను పూర్వము "దేవ బ్రాహ్మణులూ" అని కూడా పిలిచేవారు

Friday, December 30, 2011

పీనాసి సూరమ్మ


విజయవాడ గ్రామంలో అమ్మవారి గుడి ఉంది. ఆ అమ్మవారి పేరు ‘గోగులమ్మ’. దసరా పండుగకు గ్రామంలోని వాళ్లు ఏడాదికి ఒకరు చొప్పున అమ్మవారికి చీరకొని ఇవ్వటం ఆచారం. శివయ్య అనే ధనవంతుడు, అతని భార్య సూరమ్మ ఆ ఊరికి కొత్తగా వచ్చారు. దసరా ఉత్సవాలు దగ్గర పడటంతో గుడి పూజారి అమ్మవారికి చీర కొనివ్వమని శివయ్య కుటుంబాన్ని కోరాడు. ‘భార్య పిసినారి, ఖర్చుకు ఒప్పుకోదు’ అని లోపల భయంగా ఉన్నప్పటికీ ఊరిపెద్దల ముందు పరువుపోతుందని ‘సరే’ అన్నాడు శివయ్య.

శివయ్య అనుకున్నట్లే చీరకొనివ్వటానికి అంగీకరించలేదు సూరమ్మ. ‘‘మనం ఈ ఊరిలో ఉండవలసిన వాళ్లం, ఊరి వారితో సఖ్యంగా ఉండకపోతే బాగుండదు’’ అని శివయ్య నచ్చచెప్పడంతో అయిష్టంగా ఒప్పుకుంది. కాని డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా నాసిరకం చీరను కొని తెచ్చింది. తమ తాహతుకు ఆ చీర ఇస్తే బాగుండదనీ, అందరూ నవ్వుకుంటారని శివయ్య చెప్పినా వినలేదు సూరమ్మ. దసరా వచ్చింది. ఆ చీరను తీసుకొని గుడికి వెళ్లారు దంపతులు. పూజా కార్యక్రమం ముగిశాక చీర ఇవ్వమని అడిగితే సూరమ్మ చీర తీసి ఇచ్చింది. ఆ చీరను చూసి అందరూ ముసిముసిగా నవ్వుకోవడం చూసి తలకొట్టేసినట్లయింది శివయ్యకి. సూరమ్మ అందమైన పట్టుచీర, నగలను ధరించి వచ్చింది.

ఆ చీరను ‘అమ్మవారి’కి చుట్టి పసుపు, కుంకుమ పెట్టి సూరమ్మకు తిరిగి ఇచ్చాడు పూజారి. ‘‘ఇదేమిటి చీరను తిరిగి ఇచ్చేస్తున్నారు?’’ అని సూరమ్మ ఆశ్చర్యంగా అడిగింది. ‘‘అంతేనమ్మా, అందరికీ శుభం కలగాలని తప్ప అమ్మవారికి ఉంచటం కోసం కాదు. ఈ చీరను ఎవరికీ ఇవ్వకుండా మీరే కట్టుకోవాలి’’ అని పూజారి చెప్పటంతో సూరమ్మ ఖంగుతింది. చీరను అమ్మవారికే ఉంచుతారనుకుని నాసిరకం చీరను తెచ్చింది సూరమ్మ. ఆ సంఘటనతో ఆమెకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంటికి వెళ్లిన తర్వాత శివయ్య ఆమెను మందలించాడు. ‘‘అమ్మవారికి పెట్టే చీర విషయంలో పిసినారితనం పనికిరాదు’’ అని బుద్ధి చెప్పాడు. తప్పు తెలుసుకున్న సూరమ్మ ఆ రోజునుంచి మంచిగా ప్రవర్తించడం అలవాటు చేసుకుంది.
 

No comments:

Post a Comment