జాండ్రపేట గ్రామప్రజలకు శుభవార్త..!

JYOTHI SAMBARAM IMAGES


సృష్టి కారకుడైన బ్రహ్మ విశ్వ సృష్టికి ఉపక్రమించి పంచ భూతములను తద్వారా దేవ, దానవ, మానవ, పశు పక్ష్యాది జీవ రాశులను సృజించెను.ఆ జీవరాసులలో పశు పక్ష్యాదులు ఎదుగుతూ దేహాభిమానము లేక సిగ్గు తెలియక నగ్నముగా సంచరించు చున్నవి. కాని బుద్ధి జీవులైన దేవ, దానవ, మానవ జాతులు దిగంబర సంచారము చూసి బ్రహ్మ కడుపు జుగుప్స పొంది మిక్కిలి భాదతో దేహ ఆచ్చాదనకు అవసరమైన వస్త్రమును తయారుచేయుటకు సిద్దపడెను. అయితే ఎంత ప్రయత్నించినా బ్రహ్మకు వస్త్రోత్పత్తి సాద్యము కాలేదు. దీనితో బ్రహ్మ కైలాసమునకేగి సృష్టి లోపమును నివేదించగా ఆ పరమేశ్వరుడు తరునోపాయముగా "దేవల మహర్షి" అనే దివ్య పురుషుని సృష్టించి ఆ మహాత్ కార్యమును ఆప్పగించెను. అంతట ఆ దేవల మహర్షి వస్త్రమును సృష్టించి, లోకమునకు అందించి సర్వ లోకాలకు నాగరికత నేర్పించెను. ఆ విధముగా మానరక్షణకు వస్త్ర సూత్ర సృష్టి చేయుట చేత "దేవలమను బ్రహ్మ " గా కీర్తింపబడెను. ఆ దివ్య పురుషుని వంశ శంభుతలే మన దేవాంగులు. మన దేవాంగులను పూర్వము "దేవ బ్రాహ్మణులూ" అని కూడా పిలిచేవారు

Friday, December 30, 2011

మానవసేవే మాధవసేవ


నూజివీడు నగరంలో భక్తశర్మ అనే వ్యక్తి ఉండేవాడు. శర్మకు చిన్నతనం నుంచి దైవభక్తి ఎక్కువ. తను స్వయంగా భగవంతుని నమ్ముతూ ఇతరులకు దేవుని గురించి బోధిస్తుండేవాడు. భక్తశర్మకి దేవాలయం నిర్మించాలనే కోరిక బలంగా ఉండేది. అయితే తన సంపాదన తక్కువగా కావడంతో ఆ కోరిక నెరవేరలేదు. కష్టపడి సంపాదించిన దాంట్లోనే కొంచెం కొంచెం కూడబెడుతూ వచ్చాడు. కొంతకాలానికి గుడి కట్టడానికి అవసరం అయిన డబ్బు కూడబెట్టాడు. గుడి నిర్మాణం మొదలుపెట్టాడు.

చాలా కష్టపడి ఏదో విధంగా దేవాలయాన్ని నిర్మించి, పూజారిని నియమించాడు. కాని భక్తిశర్మకి సంతృప్తి లేదు. తదనంతరం ఈ గుడిని ఎవరు కాపాడతారనే ప్రశ్న భక్తశర్మను వేధించసాగింది.

దేవాలయ బాధ్యతలను చూసుకోవడానికి ఒక మనిషి అవసరం భావించాడు. గుడిని పదికాలాల పాటు కాపాడే, మంచి గుణగణాలు ఉన్న వ్యక్తి కోసం దేవాలయానికి వచ్చిపోయే వారందరినీ పరిశీలనగా చూడసాగాడు. చాలా మంది భక్తులు వచ్చేవారు. దేవుని దర్శించుకొని ఎవరి మానాన వారు వెళ్లిపోయేవారు. ప్రతిరోజూ గుడికి వస్తున్న భక్తుల్ని అలాగే చూస్తూ ఉండేవాడు భక్తశర్మ.

అయితే ఒకరోజు చింపిరి జుట్టుతో, మాసిన బట్టలు ధరించిన ఒక వ్యక్తి గుడికి నడుచుకుంటూ వస్తూ మార్గమధ్యంలో భూమిలోపలకు పాతుకుపోయిన ఒక రాయిని గమనించాడు. ఆ రాయి తగిలి భక్తుల కాళ్లకు గాయాలవుతున్నాయి. ఎవరూ దాని గురించి పట్టించుకోవటంలేదు. ‘‘ఇంతమంది భక్తులకు బాధ కలిగిస్తున్న రాయిని తొలగించాలి’’ అనుకుని, ఒక పలుగును తెచ్చి దాన్ని తొలగించి రోడ్డును సరిచేశాడు. చేతులు శుభ్రం చేసుకొని గుడికి బయలు దేరాడు.
ఇదంతా గమనించిన భక్తశర్మ ఆ వ్యక్తిని పిలిచి, అభినందించాడు. ‘‘నేను నీలాంటి వ్యక్తి కోసమే చూస్తున్నాను.

నీకు ఇష్టమైతే ఈ గుడి బాధ్యతలు చేపట్టు’’ అని భక్తశర్మ అడిగాడు. దానికి ఆ వ్యక్తి ‘‘నాలో ఏం చూసి ఈ బాధ్యతలు అప్పగించదలిచారో తెలుసుకోవచ్చా’’ అని అడిగాడు. ‘‘నువ్వు గుడికి వస్తూ పదిమంది భక్తుల మేలుకోసం చేసిన పని చాలు నీ మంచితనం తెలుసుకోవటానికి’’ అన్నాడు భక్తశర్మ. గుడి బాధ్యతలు స్వీకరించటానికి అంగీకరించిన ఆ వ్యక్తి గుడి పవిత్రతను పది కాలాలపాటు కాపాడుతానని ప్రమాణం చేశాడు. దాంతో భక్తశర్మ ఆనందంగా గుడి బాధ్యతలు అప్పగించాడు.
 

No comments:

Post a Comment