జాండ్రపేట గ్రామప్రజలకు శుభవార్త..!

JYOTHI SAMBARAM IMAGES


సృష్టి కారకుడైన బ్రహ్మ విశ్వ సృష్టికి ఉపక్రమించి పంచ భూతములను తద్వారా దేవ, దానవ, మానవ, పశు పక్ష్యాది జీవ రాశులను సృజించెను.ఆ జీవరాసులలో పశు పక్ష్యాదులు ఎదుగుతూ దేహాభిమానము లేక సిగ్గు తెలియక నగ్నముగా సంచరించు చున్నవి. కాని బుద్ధి జీవులైన దేవ, దానవ, మానవ జాతులు దిగంబర సంచారము చూసి బ్రహ్మ కడుపు జుగుప్స పొంది మిక్కిలి భాదతో దేహ ఆచ్చాదనకు అవసరమైన వస్త్రమును తయారుచేయుటకు సిద్దపడెను. అయితే ఎంత ప్రయత్నించినా బ్రహ్మకు వస్త్రోత్పత్తి సాద్యము కాలేదు. దీనితో బ్రహ్మ కైలాసమునకేగి సృష్టి లోపమును నివేదించగా ఆ పరమేశ్వరుడు తరునోపాయముగా "దేవల మహర్షి" అనే దివ్య పురుషుని సృష్టించి ఆ మహాత్ కార్యమును ఆప్పగించెను. అంతట ఆ దేవల మహర్షి వస్త్రమును సృష్టించి, లోకమునకు అందించి సర్వ లోకాలకు నాగరికత నేర్పించెను. ఆ విధముగా మానరక్షణకు వస్త్ర సూత్ర సృష్టి చేయుట చేత "దేవలమను బ్రహ్మ " గా కీర్తింపబడెను. ఆ దివ్య పురుషుని వంశ శంభుతలే మన దేవాంగులు. మన దేవాంగులను పూర్వము "దేవ బ్రాహ్మణులూ" అని కూడా పిలిచేవారు

Wednesday, February 20, 2013

వేపచెట్టు

      మన గ్రామీణ ప్రాంతంలో ఇంచుమించు ప్రతీ పల్లెసీమలోనూ దర్శనమిచ్చే చెట్టు వేప.ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ చెట్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వృక్షంగా గుర్తించింది.ఇది అజడిరక్త సంతతికి చెందినది.
ఎన్నో ఉపయోగాలు కలిగిన వేప వృక్షం ఇంచుమించు 30 నుండి 40 మీటర్ల వరకూ పెరగగలదు.దీని కాండం నుండి ఆకు వరకూ ప్రతీదీ మనిషికి ఎదోరకంగా ఉపయోగపడుతునే ఉంటాయి.
వేపచెట్టు ఉపయోగాలు -
1.దీని నుండి తిసే నూనెను సబ్బులు,క్రీంస్,షాంపులు మొదలైన వాటి తయారిలో ఉపయోగిస్తారు.అంతే కాకుండా చర్మ వ్యాధులు నివారణకు కూడా వాడతారు.
2.వీటి గింజల పొడిని అనేక రకాల మందుల తయారిలో వినియోగిస్తారు.
3.ఆయుర్వేదంలో కూడా ఈ వృక్షం అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.
4.దీని పువ్వుతో చేసే ఉగాది పచ్చడిని ఉగాది రోజున అందరూ ఆరగిస్తారు.
5.వేపచెట్టు నుండి వచ్చే కలపను గృహ సంబదిత వస్తువులైన మంచాలు,గుమ్మాలు,కిటికిలు మొదలైన వాటి తయారీ కోసం వాడతారు.
6.కొన్ని రకాలైన అంటు వ్యాధులు సోకినపుడు దీని ఆకులతో లేపనం పూస్తారు.
7.హిందూ దేవతలకు ఎంతో ఇష్టమైనవి వేప ఆకులు అందుకే జాతర సమయంలో వీటిని అమ్మవారి గుడికి కడతారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సుగుణాలు కలిగిన వేపచెట్టు మానవాళికి ఎంతగానో సహయపడుతుంది.

No comments:

Post a Comment