జాండ్రపేట గ్రామప్రజలకు శుభవార్త..!

JYOTHI SAMBARAM IMAGES


సృష్టి కారకుడైన బ్రహ్మ విశ్వ సృష్టికి ఉపక్రమించి పంచ భూతములను తద్వారా దేవ, దానవ, మానవ, పశు పక్ష్యాది జీవ రాశులను సృజించెను.ఆ జీవరాసులలో పశు పక్ష్యాదులు ఎదుగుతూ దేహాభిమానము లేక సిగ్గు తెలియక నగ్నముగా సంచరించు చున్నవి. కాని బుద్ధి జీవులైన దేవ, దానవ, మానవ జాతులు దిగంబర సంచారము చూసి బ్రహ్మ కడుపు జుగుప్స పొంది మిక్కిలి భాదతో దేహ ఆచ్చాదనకు అవసరమైన వస్త్రమును తయారుచేయుటకు సిద్దపడెను. అయితే ఎంత ప్రయత్నించినా బ్రహ్మకు వస్త్రోత్పత్తి సాద్యము కాలేదు. దీనితో బ్రహ్మ కైలాసమునకేగి సృష్టి లోపమును నివేదించగా ఆ పరమేశ్వరుడు తరునోపాయముగా "దేవల మహర్షి" అనే దివ్య పురుషుని సృష్టించి ఆ మహాత్ కార్యమును ఆప్పగించెను. అంతట ఆ దేవల మహర్షి వస్త్రమును సృష్టించి, లోకమునకు అందించి సర్వ లోకాలకు నాగరికత నేర్పించెను. ఆ విధముగా మానరక్షణకు వస్త్ర సూత్ర సృష్టి చేయుట చేత "దేవలమను బ్రహ్మ " గా కీర్తింపబడెను. ఆ దివ్య పురుషుని వంశ శంభుతలే మన దేవాంగులు. మన దేవాంగులను పూర్వము "దేవ బ్రాహ్మణులూ" అని కూడా పిలిచేవారు

Wednesday, February 20, 2013

పూర్ణకుంభం

పూర్ణకుంభం
Poorna kumbham,Ap symbols,Poorna kumbham photos,how to preapre Poorna kumbham,andhra pradesh state symbols,Purna kumba,Purna kumbha
    పూర్ణకుంభాన్ని హిందువులు పవిత్రత,శుభసూచికలకు చిహ్నంగా భావించి పెళ్ళిళ్ళు,గృహప్రవేశం మొదలైన శుభకార్యాలకు ఏర్పాటుచేసేవారు.దినిని మన రాష్ట్ర ప్రభుత్వం అధికార చిహ్నంగా గుర్తించింది.తెలుగువారు ఇంచుమించు ప్రతీ శుభకార్యంలోనూ పూర్ణకుంభం ను ఉపయోగిస్తారు.
పూర్ణకుంభం తయారు చేయువిధానం -
    ఇత్తడి చెంబులాంటి పాత్రలో సగభాగం వరకూ నీటిని నింపి పైభాగంలో కొబ్బరికాయను ముచ్చిక పైకి వచ్చెటట్టు ఏర్పాటు చేస్తారు.చెంబు అంచు చుట్టూ పసుపుతో తడిపిన దారంతో మామిడాకులను కట్టి వేద మంత్రోచ్చారనతో దీనిని రూపొందిస్తారు.పూర్ణకుంభంతో స్వాగత సమయంలో అతిదులకు ఆహ్వనం పలుకుతారు.

No comments:

Post a Comment