జాండ్రపేట గ్రామప్రజలకు శుభవార్త..!

JYOTHI SAMBARAM IMAGES


సృష్టి కారకుడైన బ్రహ్మ విశ్వ సృష్టికి ఉపక్రమించి పంచ భూతములను తద్వారా దేవ, దానవ, మానవ, పశు పక్ష్యాది జీవ రాశులను సృజించెను.ఆ జీవరాసులలో పశు పక్ష్యాదులు ఎదుగుతూ దేహాభిమానము లేక సిగ్గు తెలియక నగ్నముగా సంచరించు చున్నవి. కాని బుద్ధి జీవులైన దేవ, దానవ, మానవ జాతులు దిగంబర సంచారము చూసి బ్రహ్మ కడుపు జుగుప్స పొంది మిక్కిలి భాదతో దేహ ఆచ్చాదనకు అవసరమైన వస్త్రమును తయారుచేయుటకు సిద్దపడెను. అయితే ఎంత ప్రయత్నించినా బ్రహ్మకు వస్త్రోత్పత్తి సాద్యము కాలేదు. దీనితో బ్రహ్మ కైలాసమునకేగి సృష్టి లోపమును నివేదించగా ఆ పరమేశ్వరుడు తరునోపాయముగా "దేవల మహర్షి" అనే దివ్య పురుషుని సృష్టించి ఆ మహాత్ కార్యమును ఆప్పగించెను. అంతట ఆ దేవల మహర్షి వస్త్రమును సృష్టించి, లోకమునకు అందించి సర్వ లోకాలకు నాగరికత నేర్పించెను. ఆ విధముగా మానరక్షణకు వస్త్ర సూత్ర సృష్టి చేయుట చేత "దేవలమను బ్రహ్మ " గా కీర్తింపబడెను. ఆ దివ్య పురుషుని వంశ శంభుతలే మన దేవాంగులు. మన దేవాంగులను పూర్వము "దేవ బ్రాహ్మణులూ" అని కూడా పిలిచేవారు

Friday, December 30, 2011

సోమయ్య ఎత్తు - Somayya Eattu


 మర్యాద రామన్న న్యాయాధికారిగా ఉన్న కాలంలో ఉజ్వలపురం అనే ఊరిలో సోమయ్య అనే ఒక పిసినారి వర్తకుడు ఉండేవాడు. సోమయ్య దగ్గర చాలా ధనం, స్థిరాస్తులు ఉన్నాయి. కానీ పిల్లికి కూడా బిచ్చం పెట్టేవాడు కాదు. అతని మనస్తత్వం తెలిసి ఎవరూ అతని దగ్గర పని చేయడానికి ముందుకు వచ్చేవారు కాదు.
ఒకసారి దూరప్రాంతం నుండి విసు అనే యువకుడు ఆ ఊరికి బతకడానికి వచ్చాడు. సోమయ్య సంగతి తెలియని విసు వచ్చిన రోజే అతని దగ్గర పనికి కుదిరాడు. అయితే సోమయ్య విసును పనిలోకి చేర్చుకునేటప్పుడు ‘నెల రోజులపాటు నేను చెప్పిన ప్రతిపనినీ చేయాలి. ఏ ఒక్కరోజైనా ఒక్క పనైనా చేయలేక పోతే జీతం డబ్బులు ఇవ్వను’ అన్న షరతు విధించాడు.

అందుకు ఒప్పుకుని విసు ఒక నెల రోజులు సోమయ్య చెప్పిన ప్రతి పనినీ చేసాడు. నెల పూర్తయిన తరువాత విసు యజమానిని జీతం అడిగాడు.

‘‘తప్పకుండా ఇస్తాను. అయితే ఒక చిన్న పని మిగిలి ఉంది. అది కూడా పూర్తి చేసి జీతం పట్టుకుపో. ఈ పెద్ద కుండను ఈ చిన్న కుండలో పెట్టు. ఒకవేళ ఈ పని నువ్వు చేయకపోతే నీకు జీతం రాదు. ముందే ఆ విషయం నీకు చెప్పాను’’ అన్నాడు సోమయ్య.

అది విని విసు తెల్లబోయాడు. సరిగ్గా అదే సమయంలో మారువేషంలో అక్కడికి వచ్చిన మర్యాద రామన్న ఇదంతా విన్నాడు. జీతం ఇవ్వకుండా ఉండటానికి సోమయ్య వేస్తున్న ఎత్తు అర్థం అయ్యింది. వెంటనే ఏం చేయాలో విసుతో చెప్పాడు. విసు గబగబా పెద్ద కుండను నేలకేసి కొట్టాడు. దాంతో అది పదహారు ముక్కలయ్యింది. విసు వాటిని చిన్న కుండలో వేసాడు. ఈసారి తెల్లబోవడం సోమయ్య వంతయింది. ఆశ్చర్యంలోంచి తేరుకున్న సోమయ్య జీతం సంగతి మర్చిపో, కుండ ఖరీదు కూడా ఇవ్వమని గోల చేయసాగాడు.

అప్పుడు రామన్న ‘‘చూడు నువ్వు పెద్ద కుండను చిన్న కుండలో పెట్టమన్నావు కానీ పగలగొట్టకుండా పెట్టమని చెప్పలేదుగా. కాబట్టి ఈ యువకుడు చేసిన పని సమంజసమే. మర్యాదగా అతని జీతం అతనికివ్వు లేదా న్యాయస్థానంలో నీ మీద ఫిర్యాదు చేస్తాను’’ అని గద్దించాడు రామన్న. ఇక తన పప్పులు ఉడకవని గ్రహించిన సోమయ్య కిమ్మనకుండా విసుకు రావాల్సిన జీతం ఇచ్చేశాడు.
 

No comments:

Post a Comment