జాండ్రపేట గ్రామప్రజలకు శుభవార్త..!

JYOTHI SAMBARAM IMAGES


సృష్టి కారకుడైన బ్రహ్మ విశ్వ సృష్టికి ఉపక్రమించి పంచ భూతములను తద్వారా దేవ, దానవ, మానవ, పశు పక్ష్యాది జీవ రాశులను సృజించెను.ఆ జీవరాసులలో పశు పక్ష్యాదులు ఎదుగుతూ దేహాభిమానము లేక సిగ్గు తెలియక నగ్నముగా సంచరించు చున్నవి. కాని బుద్ధి జీవులైన దేవ, దానవ, మానవ జాతులు దిగంబర సంచారము చూసి బ్రహ్మ కడుపు జుగుప్స పొంది మిక్కిలి భాదతో దేహ ఆచ్చాదనకు అవసరమైన వస్త్రమును తయారుచేయుటకు సిద్దపడెను. అయితే ఎంత ప్రయత్నించినా బ్రహ్మకు వస్త్రోత్పత్తి సాద్యము కాలేదు. దీనితో బ్రహ్మ కైలాసమునకేగి సృష్టి లోపమును నివేదించగా ఆ పరమేశ్వరుడు తరునోపాయముగా "దేవల మహర్షి" అనే దివ్య పురుషుని సృష్టించి ఆ మహాత్ కార్యమును ఆప్పగించెను. అంతట ఆ దేవల మహర్షి వస్త్రమును సృష్టించి, లోకమునకు అందించి సర్వ లోకాలకు నాగరికత నేర్పించెను. ఆ విధముగా మానరక్షణకు వస్త్ర సూత్ర సృష్టి చేయుట చేత "దేవలమను బ్రహ్మ " గా కీర్తింపబడెను. ఆ దివ్య పురుషుని వంశ శంభుతలే మన దేవాంగులు. మన దేవాంగులను పూర్వము "దేవ బ్రాహ్మణులూ" అని కూడా పిలిచేవారు

Friday, December 30, 2011

యువరాణి ఏడ్చింది


బెజవాడ రాజ్య యువరాణికి ప్రియపాత్రమైన చాకలామె ఉండేది. యువరాణికి అన్ని విధాలుగా సేవలు చేయటమే కాకుండా ఆమెకు లోకంలోని అనేక విషయాలు చెప్తూ ఎప్పుడూ నవ్విస్తూ నవ్వుతూ ఉండేది. యువరాణి చాకలామెను ఒక సేవకురాలుగా కాకుండా ఒక స్నేహితురాలుగా చూసేది.

ఒకసారి చాకలామె పనిచేయటానికి రాజుభవనానికి వచ్చింది. వచ్చీ రావటంతోనే యువరాణిని చూసి ఏడ్పు మొదలు పెట్టింది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే చాకలామె ఏడ్వటం చూడని రాజకుమారికి బాధ కల్గింది. ఆమె కూడా ఏడ్వసాగింది. యువరాణి ఏడ్వటం చూసిన మహారాజు కూడా ఏడ్చాడు. రాజుగారు ఏడ్వటంతో మహామంత్రి, ఆయన్ని చూసి మంత్రులు, వారిని చూసి సేవకులు, అలా భటులు వారిని చూసిన ప్రజలు ఇలా అందరూ ఏడ్వసాగారు.

పొరుగుదేశం నుంచి వ్యాపార నిమిత్తం బెజవాడ దేశానికి ఒక వర్తకుడు వచ్చాడు. అతనికి దేశంలో ప్రజలందరూ ఏడుస్తూ కన్పించారు. ఎవ రు చూసిన ఏడుస్తూ కన్పించటంతో అతనికి ఆశ్చర్యం కలిగింది. ‘అసలు ఏం జరిగి ఉంటుంది?’ అనుకొని ఆరా తీసాడు ఆ వ్యాపారస్తుడు. ఆ రాజ్యంలోని ‘ఒక సామాన్యుడిని ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగాడు.

‘‘ మా రాజ్యంలోని సేవకులను చూసి..’’ అన్నాడు. సేవకుల్ని అడిగితే వారు మా రాజ్యంలో భటులు ఏడ్వటం చూసి అని అన్నారు. భటులను అడిగాడు. భటులు మా సేనాని చూసి అన్నారు. సేనానిని అడిగితే అతను మా మంత్రులను చూసి అన్నాడు.... ఈ విధంగా అతను అందరినీ అడుగుతూ చివరకు యువరాణి దగ్గరకు చేరాడా వర్తకుడు. ‘‘తమరు ఎందుకు ఏడుస్తూన్నారు?’’ అని అడిగాడు. చాకలామె ఏడ్వటం చూసి ఏడ్చినట్లు యువరాణి చెప్పింది.

దాంతో వర్తకుడు చాకలామె దగ్గరకు వచ్చి ‘‘ఎందుకు ఏడుస్తున్నావు?’’ అని అడిగాడు. అప్పుడు ఆమె ‘‘మా మల్లేశం ఇకలేడు. పోయాడు’’ అంటూ ఏడ్పు మొదలు పెట్టింది.
‘‘మల్లేశం అంటే మీ భర్తా?’’ అని అడిగితే, ‘‘కాదు. మా గాడిద!’’ అని సమాధానం చెప్పింది. చాకలామె చెప్పిన సమాధానం విన్న వర్తకుడికి నవ్వాలో ఏడ్వాలో తెలియలేదు. ‘గాడిద కోసం రాజ్యంలో ప్రజలందరూ ఏడ్వటం నిజంగా విడ్డూరమే!’ అనుకున్నాడు వ్యాపారి.
 

No comments:

Post a Comment