జాండ్రపేట గ్రామప్రజలకు శుభవార్త..!

JYOTHI SAMBARAM IMAGES


సృష్టి కారకుడైన బ్రహ్మ విశ్వ సృష్టికి ఉపక్రమించి పంచ భూతములను తద్వారా దేవ, దానవ, మానవ, పశు పక్ష్యాది జీవ రాశులను సృజించెను.ఆ జీవరాసులలో పశు పక్ష్యాదులు ఎదుగుతూ దేహాభిమానము లేక సిగ్గు తెలియక నగ్నముగా సంచరించు చున్నవి. కాని బుద్ధి జీవులైన దేవ, దానవ, మానవ జాతులు దిగంబర సంచారము చూసి బ్రహ్మ కడుపు జుగుప్స పొంది మిక్కిలి భాదతో దేహ ఆచ్చాదనకు అవసరమైన వస్త్రమును తయారుచేయుటకు సిద్దపడెను. అయితే ఎంత ప్రయత్నించినా బ్రహ్మకు వస్త్రోత్పత్తి సాద్యము కాలేదు. దీనితో బ్రహ్మ కైలాసమునకేగి సృష్టి లోపమును నివేదించగా ఆ పరమేశ్వరుడు తరునోపాయముగా "దేవల మహర్షి" అనే దివ్య పురుషుని సృష్టించి ఆ మహాత్ కార్యమును ఆప్పగించెను. అంతట ఆ దేవల మహర్షి వస్త్రమును సృష్టించి, లోకమునకు అందించి సర్వ లోకాలకు నాగరికత నేర్పించెను. ఆ విధముగా మానరక్షణకు వస్త్ర సూత్ర సృష్టి చేయుట చేత "దేవలమను బ్రహ్మ " గా కీర్తింపబడెను. ఆ దివ్య పురుషుని వంశ శంభుతలే మన దేవాంగులు. మన దేవాంగులను పూర్వము "దేవ బ్రాహ్మణులూ" అని కూడా పిలిచేవారు

Friday, December 30, 2011

ఏది శాశ్వతదానం?


సువర్ణపురాన్ని హేమంతుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన పరిపాలనలో సువర్ణపురం ప్రజలు ఏ కష్టం లేకుండా ఆనందంగా గడిపేవారు. అయితే హేమంతుడు కొంచెం అహంకారి. ఒకసారి హేమంతుడు తన జన్మదినం సందర్భంగా నిరుపేద యువకులకు డబ్బు దానంగా ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. ప్రతి ఊరి నుంచి పేద యువకుల పేర్లు సేకరించి పంపమని ఉత్తర్వులు పంపాడు. దేశం నలుమూలల నుంచి ఎంతోమంది యువకుల వివరాలు రాజసౌధానికి చేరాయి. వాటిని రాజు స్వయంగా పరిశీలించి అందరికీ సమానంగా అందేలా ధనం పంపించాడు. కొన్నిరోజుల తరువాత కోసంగి అనే గ్రామానికి చెందిన గ్రామపెద్ద విశ్వంభరుడనే యువకుడి గురించి వివరాలు తెలియజేస్తూ, ‘అతను కడుపేదవాడు, అనాథ. అయితే దానం తీసుకోవడానికి తిరస్కరిస్తున్నాడు’ అని రాసి పంపాడు.

దానిని చదవగానే ముందు హేమంతుడుకి చాలా కోపం వచ్చింది. వెంటనే విశ్వంభరుడిని తన ఆస్థానానికి తీసుకురావలసిందిగా ఆదేశాలను జారీ చేశాడు. ఆ మరుసటి రోజుకల్లా భటులు విశ్వంభరుడిని రాజు ముందు ప్రవేశపెట్టారు.
‘‘ఎంత ఆహంకారం నీకు, మేమిచ్చే దానాన్ని తిరస్కరిస్తావా?’’ అని కోపంగా అడిగాడు హేమంతుడు.

‘‘ప్రభువుల వారు నన్ను క్షమించాలి. మీరిస్తున్న దానం తాత్కాలికమైనది. అందుకే అది నాకు అక్కరలేదు’’ అని వినయంగా చెప్పాడు విశ్వంభరుడు.
ఆ సమాధానంతో ఆలోచనలో పడ్డాడు హేమంతుడు.
‘‘మహాప్రభూ! మీరిచ్చిన ధనంతో నేను ఆరునెలల పాటు ఏ ఇబ్బందీ లేకుండా జీవనం గడుపుతానేమో... మరి ఆ తరువాత నా పరిస్థితి యథావిధిగా మారిపోతుంది. అందుకే మీరు నాకు జీవితమంతా పనికొచ్చే శాశ్వతమైన దానం ఇవ్వండి’’ అని అడిగాడు.
ఆ మాటలకు హేమంతుడు ‘‘అలాంటి దానం కూడా ఉంటుందా?’’ అని ఆశ్చర్యంగా అడిగాడు.

‘‘విద్యాదానం ప్రభూ! పేదలకు ఉచితవిద్యను ప్రసాదించే విద్యాలయాలు లేక నాలాంటి యువకులు నిరక్షరాస్యులుగా మిగిలిపోతున్నారు. మాకు విద్యాదానాన్ని ప్రసాదించండి’’ అని అభ్యర్థించాడు.

ఆ యువకుడి మాటల్లోని సత్యం బోధపడి హేమంతుడిలోని అహంకారం నశించిపోయింది. వెంటనే అనేక పాఠశాలలు నిర్మించి ఎంతోమంది నిరుపేదలు ఉచితంగా చదువుకునే ఏర్పాటుచేశాడు.

No comments:

Post a Comment